Site icon Prime9

Weather Update: దూసుకొస్తున్న “మాండస్” తుఫాను.. ఏపీపైనా ప్రభావం

Cyclone Mandous likely to form over Bay of Bengal, hit Andhra, Tamil Nadu

Cyclone Mandous likely to form over Bay of Bengal, hit Andhra, Tamil Nadu

Weather Update: తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని సూచించింది.

గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, పుదుచ్చేరితోపాటు పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న తుఫానుకు ‘మాండస్’ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేరు పెట్టింది. తుఫాను ఈ నెల 7, 8 తేదీల్లో తీరంవైపు దూసుకొస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు తమిళనాడులోని తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. కాగా మాండస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడే అవకాశం ఉంది అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: గుజరాత్, హిమాచల్ లో బీజేపీ.. ఢిల్లీ మున్పిపల్ ఎన్నికల్లో ఆప్ .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

Exit mobile version