Site icon Prime9

BF-7 Variant: మళ్లీ కరోనా కలవరం.. బీఎఫ్-7 అంటూ కొత్త రూపంలో..!

124 cases find in foreigners with 11 variants who come to india

124 cases find in foreigners with 11 variants who come to india

Gujarat: యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా వైరస్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ తన ఉనికిని చాటుకుంటోందని నిపుణులు అంటున్నారు.

బీఎఫ్-7 అనే కరోనా సబ్ వేరియంట్ ను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్ ను గుర్తించింది. ఈ వేరియంట్ తొలుత చైనాలో వెలుగు చూసిందని ఆ తర్వాత చాలా వేగంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం దేశాలకు వ్యాపించింది వారు చెప్తున్నారు. ఈ బీఎఫ్-7 వేరియంట్ కు ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఉందని అందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని డబ్యూహెచ్వో స్పష్టం చేసింది. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే బీఎఫ్-7 అనేది డామినెంట్ వేరియంట్ గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక కూడా హెచ్చరించింది. ఇదిలా ఉండగా బీఏ 5.1.7 అనే సబ్ వేరియంట్ ను కూడా చైనాలో గుర్తించారు.

ఇదీ చదవండి: భార్య మార్పిడి క్రీడ.. కీచకుడిగా మారిన భర్త..!

Exit mobile version
Skip to toolbar