Congress: గ్యాంగ్ స్టర్ అతీక్ సోదరుల హత్యపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే..?

గ్యాంగ్ స్టర్ గా పేరు మోసిన అతీక్ పై దాదాపు 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య సంబంధించి

Congress: గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ సోదరుల హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్యపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేరస్థులను కఠినంగా శిక్షించాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. కానీ, చట్టానికి లోబడే నిందితులను శిక్షించాలని పేర్కొంది. రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని అతిక్రమించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అయితే, ప్రకటనలో అతీక్‌ పేరుగానీ, వారి హత్యకు సంబంధించిన విషయాలను గానీ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలో ప్రస్తావించక పోవడం గమనార్హం.

చట్టాన్ని కాపాడాలి(Congress)

రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలే అత్యున్నతమని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని తెలిపారు. అదే విధంగా అలాంటి వారికి రక్షణ కల్పించే వారిని కూడా బాధ్యుల్ని చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో చట్టం, న్యాయానికి గౌరవం దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ అంశంపై ట్వీట్‌ చేశారు. చట్టాన్ని కాపాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

 

 

యూపీలో హైటెన్షన్

గ్యాంగ్ స్టర్ గా పేరు మోసిన అతీక్ పై దాదాపు 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య సంబంధించి ప్రధాన సాక్షి ఉమేశ్ పాల్ ను హత్య చేసిన కేసులో అతీక్ నిందితులు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవల అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్ రాజ్ కు తీసుకొచ్చారు. అసద్ అంత్యక్రియలు జరిగిప ప్రాంతానికి కేవలం 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అతీక్ సోదరులను శనివారంతా విచారించారు. అనంతరం మెడికల్ టెస్టుల కోసం రాత్రి 10 గంటల సమయంలో ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి నుంచి వెళ్లే క్రమంలో మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించింది.

కుమారుడి అంత్యక్రియలు హాజరు కాలేకపోయారు అని మీడియా ప్రశ్నించగా.. పోలీసులు అనుమతించలేదని అతీక్ సమాధానమిచ్చారు. అసలు విషయం ఏంటంటే.. అని అతీక్ చెబుతుండగానే క్షణకాలంలో కాల్పులు జరిగాయి. మీడియా ప్రతినిధులుగా అక్కడే ఉన్న వారు పిస్లళ్లు తీసి కాల్పులు జరిపారు. దీంతో సోదరులిద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిందితులు ఇద్దరు స్వయంగా పోలీసులు లొంగిపోయారు. మూడో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య నేపథ్యంలో మెడికల్ కాలేజ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దృశ్యాలన్నీ మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పుల ఘటనకు కారణమైప ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.