Site icon Prime9

CM KCR: అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్‌- కేసీఆర్

cm kcr speech in bangarugadda at munugode

cm kcr speech in bangarugadda at munugode

CM KCR: తాము అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ అన్నారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక ప్రకటనలు చేశారు. భారాస అధికారంలోకి వస్తే.. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మరఠా ప్రాంతం ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందని అన్నారు. దేశంలో ప్రభుత్వాలు మారిన.. ప్రగతి మాత్రం సాధ్యం కాలేదన్నారు. దేశంలో నేతలు మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికే.. అడుగు ముందుకేసామని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కు దేశ వ్యాప్తంగా మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు.

రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి..

దేశంలో మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు ఎక్కువని కేసీఆర్ అన్నారు. పుష్కలంగా నీరు ఉన్న ప్రాంతంలో కూడా రైతుల మరణాలు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు.

ఈ రైతుల ఆత్మహత్యలకు కారణం.. గత ప్రభుత్వాలే అని విమర్శించారు.

బలవంతులం.. తమను ఎవరు ఏం చేయలేరు అనుకునే నేతల పతనం తప్పదని హెచ్చరించారు.

దేశంలో ఇప్పటికి పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందడం లేదన్నారు.

రైతులు పండించిన పంటకు.. వారే ధరను నిర్ణయించేలా చైతన్యం రావాలన్నారు.

అలా జరిగినపుడే.. రైతు రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కుల, మతాల పేరుతో గొడవలు సృష్టించే పార్టీలను దేశం నుంచి తరిమివేయాలని పిలుపునిచ్చారు.

నాయకుల బదులు రైతులు గెలవాలని.. ఆ ఉద్దేశంతోనే అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకొచ్చమన్నారు.

మోదీ ప్రవేశ పెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా జోక్‌ ఇన్‌ ఇండియా అయిందన్నారు.

రైతులకు అండగా భారాస..

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని.. అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికి అండగా ఉంటామని కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది. అలాంటిది దేశంలో ఎందుకు సాధ్యం కాదని అన్నారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. వాటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

ప్రమాదంలో రైతు బీమా అందిస్తున్నామని.. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు.

బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రెండేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామని కేసీఆర్CM KCR హామీ ఇచ్చారు.

అధికారమిస్తే.. 24 గంటల విద్యుత్‌

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు.

దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేవలం బొగ్గుతోనే 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చని తెలిపారు.

తెలంగాణలో వచ్చిన మార్పు..దేశమంతా రావాల్సిన అవసరముందన్నారు.

దేశమంతా గులాబీ జెండా ఎగరాలని.. కిసాన్‌ సర్కార్‌ రావాలని కోరారు. అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version