Site icon Prime9

Union Home Ministry: విభజన సమస్యల పై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం

partition issues

partition issues

New Delhi: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పై కేంద్ర హోం శాఖ మరోమారు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఈ నెల 23న ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈ భేటీకి తప్పకుండా హాజరుకావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్ర నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 27న విభజన సమస్యల పై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 7 ఉమ్మడి అంశాల పై చర్చించారు. ఏపీకి సంబంధించి ఏడు అంశాల పై కేంద్ర అధికారులు చర్చించారు. ఇటీవల జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదని రైల్వేశాఖ అధికారులు చెప్పడం దానిని తరువాత రైల్వేమంత్రి ఖండించడం జరిగింది. ఈ సారి విభజన సమస్యలపై పూర్తిస్దాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు, లోటు భర్తీ, అమరావతికి నిధులు తదితర అంశాలను కేంద్రం ఎజెండాలో చేర్చింది.

ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి అయితే సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version