Site icon Prime9

Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. ఇకపై వారి కార్డులు రద్దు

central govt take action on fake ration cards

central govt take action on fake ration cards

Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారందరీ రేషన్ కార్డులను రద్దు చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారు. కాగా వారిలో చాలా మంది అనర్హులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారికి అందజేసే బియ్యం, గోధమలు, కందిపప్పు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. అనర్హులందరి పూర్తి జాబితాను సిద్ధం చేసి రేషన్ డీలర్లకు పంపుతామని లిస్టు వారి వద్దకు చేరగానే నకిలీ కార్డులు కలిగిన వారికి రేషన్ ఆగిపోనుందని ప్రభుత్వం తెలిపింది.

ఆదాయపు పన్ను చెల్లించే వారి పేర్లు లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారి పేర్లు రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించనున్నారు. అదే విధంగా నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.  ఈ విధంగా నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన కార్డులు త్వరలోనే రద్దు కానున్నాయి. అంతేకాకుండా రేషన్ కార్డు నకిలీదని తేలితే.. వారి నుంచి రేషన్‌ కూడా రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం.

ఇదీ చదవండి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్.. అంతరిక్షం వరకు హైదరాబాద్ ఖ్యాతి

Exit mobile version