Site icon Prime9

కరోనా : చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు… భారత్‌కి పొంచి ఉన్న ముప్పు

central and state governments focus on corona 4th wave

central and state governments focus on corona 4th wave

Corona : కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా… వారి కుటుంబ సభ్యులు పరిస్థితి ఎంతో కష్టంగా మారింది. ఇప్పటికీ మూడు వేవ్ లు వచ్చిన కరోనా మరోసారి నాలుగో వేవ్ రూపంలో రానున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని పరిస్థితులపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఎన్‌టీఏజీఐ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ… ‘‘చైనా పరిస్థితిపై మనం నిశితంగా నిఘా ఉంచడం తప్పనిసరి. కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేశ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నందున ఆందోళన చెందనవసరం లేదు. కోవిడ్ వైరస్ కొత్త సబ్-వేరియంట్ల విషయంలో దేశం తగిన చర్య తీసుకోగలదని అరోరా తెలిపారు. కొత్త సబ్-వేరియంట్ లేదా ఏదైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని, వారానికి ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నట్లు ఈ నేపథ్యంలోనే కోవిడ్ కేసులను జినోమ్‌ సీక్వెన్సింగ్ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

అదే విధంగా జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికా, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నందున దేశంలోని పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్ష నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కేసు నమోదు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 23.5 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారిలో సుమారు 14,733 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ తరుణం లోనే ప్రజలు అలసత్వం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని మనవి.

Exit mobile version