Site icon Prime9

Delhi: 10 మంది కౌన్సిలర్లకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిన బీజేపీ.. ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపణ

DELHI

DELHI

Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ తమ పార్టీకి చెందిన  కౌన్సిలర్లను కొనుగోలు చేసేందకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. సీనియర్ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్, కొత్తగా ఎన్నికైన తమ కౌన్సిలర్‌లను సంప్రదించి పార్టీ మారమని బీజేపీ బలవంతం చేస్తోందని వారికి భారీ మొత్తాలను ఆఫర్ చేసిందని ఆరోపించారు.

సంజయ్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు డాక్టర్ రోనాక్షి శర్మ, అరుణ్ నవారియా మరియు జ్యోతి రాణి–ని శనివారం ఫోన్ ద్వారా సంప్రదించారు. ఢిల్లీ బిజెపి పార్టీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తాతో మాట్లాడాలని చెప్పారు.కొత్తగా ఎన్నికైన 10 మంది కౌన్సిలర్‌లను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఉందని ముగ్గురు కౌన్సిలర్లతో ను “యోగేంద్ర” అనే   వ్యక్తి చెప్పాడని సింగ్ చెప్పారు. మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గోవా, గుజరాత్‌లలో మాదిరిగానే బీజేపీ కూడా డర్టీ గేమ్‌లకు దిగిందని సంజయ్ సింగ్‌ అన్నారు.

అయితే తమ కౌన్సిలర్లు పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉన్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిగ్గులేని పార్టీ అని, 30 తక్కువ సీట్లు వచ్చినా మేయర్ తమదేనని అంటోందని సింగ్ అన్నారు. 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో ఆప్ 134 వార్డులను గెలుచుకుంది. 15 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న ఈ కార్పోరేషన్ ను 104 వార్డులు గెలుచుకున్న బీజేపీ దక్కించుకోలేకపోయింది.

Exit mobile version