Site icon Prime9

డబుల్ బెడ్ రూం ఇళ్లు: మహారాష్ట్రలో బెడ్ రూమ్.. తెలంగాణలో కిచెన్.. రెండు రాష్ట్రాల సరిహద్దులో నిలిచిన ఇల్లు

House

House

Maharashtra: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొంతకాలంగా ముదురుతోంది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూడాలని కోరారు. మేఘాలయ-అసోం సరిహద్దు వివాదం, అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం తర్వాత కేంద్రానికి ఇది కొత్త తలనొప్పిగా మారుతోంది.

ఇలా ఉండగా మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఓ ఇల్లు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. చంద్రాపూర్‌లోని మహారాజగూడ గ్రామంలోని ఈ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉంది. సరిహద్దు ఇంటి మధ్యభాగం గుండా వెళుతుంది.ఈ ఎనిమిది గదుల ఇంట్లో మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ‘మేము 13 మంది ఇక్కడ నివసిస్తున్నాం. నా సోదరుడు మరియు అతని కుటుంబం తెలంగాణలో నాలుగు గదులలో నివసిస్తున్నారు. నేను, నా కుటుంబం మహారాష్ట్రలో నాలుగు గదుల్లో ఉన్నాం. మా వంటగది తెలంగాణలో ఉంది’ అని ఇంటి యజమాని ఉత్తమ్ పవార్ అన్నారు.

1969లో సరిహద్దు సర్వే నిర్వహించినప్పుడు వారి ఇళ్లలో సగం మహారాష్ట్రలో, మిగిలిన సగం తెలంగాణలో ఉన్నట్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. రెండు రాష్ట్రాల గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తున్నారు.అయితే తాము తెలంగాణ ప్రభుత్వ పథకాల కింద ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నామని ఉత్తమ్ పవార్ అన్నారు.

చంద్రాపూర్ జిల్లా చివరన ఉన్న 14 గ్రామాలు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. ఈ గ్రామాలపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోని పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో అన్ని ప్రయోజనాలు తమకు అందుతున్నాయని తెలిపారు.

Exit mobile version