Site icon Prime9

Assam: ప్రేమంటే ఇదేరా.. ప్రియురాలి మృతదేహానికి తాళికట్టాడు

assam-youth-marries-dead-girlfriend-pledges-not-to-marry-all-his-life

assam-youth-marries-dead-girlfriend-pledges-not-to-marry-all-his-life

Assam: వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి జీవితాలతో విధి వింత గేమ్ ఆడింది. అనారోగ్యం బారినపడి ప్రియురాలు మృతి చెందింది. ప్రేయసి మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా.. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకుని మృతదేహానికి తాళి కట్టి ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ అరుదైన ఘటన అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో జరిగింది.

మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రియురాలి మృతి వార్త విని బిటుపన్ తట్టుకోలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. అచేతనంగా ఉన్న ఆమెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చివరికి అక్కడే అందరి ముందు మృతదేహానికి తాళి కట్టి బోరాను తప్ప మరెవరినీ తన జీవిత భాగస్వామిగా ఊహించుకోలేనంటూ పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన ప్రేమ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల్లో ఓడిపోతే ఇంత మర్యాదలా.. కోట్ల నగదు, కారు గిఫ్ట్

Exit mobile version