Site icon Prime9

Delhi: ఆప్ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన కార్యకర్తలు.. వీడియో వైరల్

aap-mla-gulab-singh-yadav-beaten-up-in-delhi

aap-mla-gulab-singh-yadav-beaten-up-in-delhi

Delhi: ఇటీవల కాలంలో ప్రజలు ప్రభుత్వాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. నిన్న కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను ఊరినుంచి గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన మరువకముందే.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై అలాంటి దాడే జరిగింది. అయితే ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. ఈ దాడి సోమవారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. త్వరలో ఢిల్లీలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు సీట్ల కేటాయింపులో కాస్త గందరగోళం నెలకొంటుంది. ఆశావహులైన వారికి కాకుండా వేరే వారికి సీట్లు కేటాయించడం పట్ల ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యేలపై దాడి చేస్తున్నారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు.

ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్యామ్ విహార్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సివిక్ పోల్స్ లో పార్టీ టికెట్ల పంపకానికి సంబంధించి ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు సమాచారం. వాడివేడిగా సాగిన ఈ సమావేశం ఓ దశలో అదుపుతప్పింది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, కార్యకర్తలు ఆయనను అడ్డుకుని దాడి చేయడం మొదలు పెట్టారు. దానితో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన గులాబ్ సింగ్ ను ఓ కార్యకర్త కాలర్ పట్టుకుని మరీ చెప్పుతో కొట్టారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఎమ్మెల్యే పారిపోయాడు. కాగా ఈ దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేను ఊర్లో నుంచి తరిమికొట్టిన ప్రజలు.. ఎందుకంటే..?

Exit mobile version