Site icon Prime9

Satyendar Jain: తిహార్ జైల్లో మంత్రికి మసాజ్.. వీడియో వైరల్

aap-minister-satyendar-jain-gets-massages-in- thihar jail

aap-minister-satyendar-jain-gets-massages-in- thihar jail

Satyendar Jain: అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.

2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో విచార‌ణ జ‌రుగుతోంది. కాగా 2017 నుంచి సత్యేందర్ జైన్ పై విచార‌ణను ఎదుర్కొంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్యేందర్ జైన్ కు సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ తిహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ఇటీవలే అధికారులు సస్పెండ్ చేశారు. కాగా ఈ నేపథ్యంలో ఆయన జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటకు రావడం తీవ్రకలకలం రేపుతుంది. సత్యేందర్ జైన్ తాను ఉంటోన్న సెల్ లోనే ఒకరితో కాళ్లు, వీపు, తలకు మసాజ్ చేయించుకుంటున్నట్లు ఈ వీడియో ఉంది. ఇదిలా ఉంటే సత్యేందర్ అవినీతికి పాల్పడినప్పటికీ సీఎం కేజ్రీవాల్ ఆయనకు మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇకపోతే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లకు పోటీగా ఆప్ బరిలోకి దిగి గట్టి పోటీని ఇస్తుంది. కాగా ఆప్ అభ్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలని యోచిస్తున్న బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ ఆప్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: మరో కేంద్ర మంత్రిపై అరెస్ట్ వారెంట్

 

Exit mobile version