Site icon Prime9

Bihar: దలైలామాపై గూఢచర్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న చైనా మహిళ అరెస్ట్

Bihar

Bihar

Bihar: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏడీజీ జేఎస్ గంగ్వార్ తెలిపారు.

సంగ్ జియోలోన్ అనే పేరుగల ఈ గూఢచారి కొన్ని రోజుల క్రితం గయాలో కాల చక్ర పూజ సందర్భంగా దలైలామా ప్రసంగం సమయంలో ఉన్నారని తరువాత అదృశ్యమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి.గయా పోలీసులు ఆమె పాస్‌పోర్ట్ ను, ఊహాచిత్రాన్ని విడుదల చేసారు. ఈ చైనా గూఢచారి దేశంలోని వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా గయాలో గత 2 సంవత్సరాలుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రయాణ చరిత్ర మరియు భారతదేశం ఎందుకు వచ్చిందనేది తెలియవలసి ఉంది. దలైలామా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు ఆమె బోధ్‌గయా మరియు చుట్టుపక్కల అనేక రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆమె స్లిమ్‌గా మరియు పొట్టి జుట్టు కలిగి ఉందని అభివర్ణించారు.

మరోవైపు దలైలామా సభలకు సరైన పత్రాలు మరియు గుర్తింపు ధృవీకరణతో మాత్రమే ప్రజలను అనుమతిస్తామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్‌ప్రీత్ కౌర్ తెలిపారు. దలైలామా డిసెంబర్ 23న బోద్ గయా చేరుకున్నారు. ఇక్కడ ఒక నెలపాటు ఉంటారు.

 

Exit mobile version
Skip to toolbar