Site icon Prime9

Bengal News: ఏందిరా సామీ.. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు..!

28 years man married 24 times

28 years man married 24 times

West Bengal: నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.

వివిధ పేర్లతో పెళ్లిళ్లు చేసుకోవడం, పెళ్లైన కొద్దినెలలకే పత్తా లేకుండా పారిపోయేవాడు ఈ నిత్యపెళ్లికొడుకు. కాగా చివరకు ఓ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కటకటాలపాలయ్యి ఊచలు లెక్క పెడుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. బెంగాల్ లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని అసబుల్ మొల్లా అనే వ్యక్తి వివాహమాడాడు. కాగా కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా అతను ఇంటి నుంచి పత్తాలేకుండా మాయమైపోయాడు. అతనితోపాటు ఇంట్లో ఉన్న తన నగలు కూడా కనిపించకుండా పోయాయి. దానితో అనుమానం వచ్చిన ఆమె తన భర్త మోసం చేశాడని గుర్తించి సాగర్ దిగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి ఒక చోటు నుంచి మరొక చోటికి పేరు, ఊరు, పనిని మార్చుకుంటూ బిహీర్, పశ్చిమ బంగాల్ లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడు. ఈ క్రమంలో తన 28 ఏళ్ల వయస్సులో 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

మోసగించి పెళ్లి చేసుకోవడం, పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బుతో పరారవ్వడం చేసేవాడు. ఇలా 23 మందిని మోసం చేసి కొద్ది నెలల క్రితం సాగర్ దిగీలోని ఓ మహిళను 24వ వివాహం చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఇక్కడ కూడా చెయ్యాలని ప్రత్నించాడు. కానీ ఈ సారి అతని చేతి వాటం పనిచెయ్యలేదు. పెళ్లాడిన అమ్మాయి అతని మోసాన్ని గ్రహించి అసబుల్పై ఫిర్యాదు చేయడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు అసబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని బాగోతం బయటపడింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పాక్ బ్యాటర్ దెబ్బ.. అంపైర్ అబ్బ..!

Exit mobile version