Site icon Prime9

Australia: ఆస్ట్రేలియన్ మహిళ కుక్క మొరిగిందని ఆమెను హత్య చేసిన భారతీయుడు

Australia

Australia

Australia: 2018లో క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా మహిళను హత్య చేసిన భారతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్‌విందర్ అనే ఈ వ్యక్తి 24 ఏళ్ల తోయా కార్డింగ్‌లీని ఆమె కుక్క మొరిగడం వల్లే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడయింది.

38 ఏళ్ల రాజ్‌విందర్ సింగ్ తన భార్యతో గొడవపడి క్వీన్స్‌లాండ్‌లోని వంగెట్టి బీచ్‌కు వెళ్లాడు. అతను కొన్ని పండ్లు మరియు కత్తిని తన వద్ద ఉంచుకున్నట్లుపోలీసులకు చెప్పాడు. కార్డింగ్లీ అనే ఫార్మసీ ఉద్యోగి, తన కుక్కతో బీచ్ వద్ద వాకింగ్ చేస్తోంది. రాజ్‌విందర్‌పై కార్డింగ్లీ కుక్క మొరగడం ప్రారంభించినప్పుడు, ఇద్దరూ వాదించుకున్నారు. దీనితో రాజ్ విందర్ కార్డింగ్లీపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టి కుక్కను చెట్టుకు కట్టేశాడు.

రెండు రోజుల తర్వాత రాజ్‌విందర్ సింగ్ తన ఉద్యోగం, భార్య మరియు ముగ్గురు పిల్లలను వదిలి ఆస్ట్రేలియా పారిపోయాడు.రాజ్ విందర్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది, దీని తర్వాత పాటియాలా హౌస్ కోర్టు నవంబర్ 21న అప్పగింత చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.భారతదేశంలో ఇంటర్‌పోల్ నోడల్ ఏజెన్సీ అయిన సీబీఐ మరియు వారి ఆస్ట్రేలియా సహచరులు పంచుకున్న ఇన్‌పుట్‌ల ఆధారంగా, నిందితుడిని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ జిటి కర్నాల్ రోడ్ సమీపంలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

 

Exit mobile version