Site icon Prime9

Lionel Messi: ధోని కుమార్తెకు మెస్సీ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?

messi

messi

Lionel Messi: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. జివా మెస్సీకి పెద్ద ఫ్యాన్. దీంతో అభిమాన ఆటగాడి నుంచి జెర్సీ రూపంలో గిఫ్ట్ రాగానే ఉబ్బితబ్బిపోయింది. మెస్సీ జెర్సీని వేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్‎గా మారింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

“తండ్రిలా, కూతురిలా” అని జివా ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో పేర్కొంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఖాతా ఆమె తల్లిదండ్రులచే నిర్వహించబడుతుంది.సాక్షి సింగ్ ధోనీ తన కుమార్తె ఆటోగ్రాఫ్ జెర్సీలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోను టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో సహా 2.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు.ఈ నెల ప్రారంభంలో, దోహాలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా జట్టు అధ్బుతంగా ఆడి కప్ గెలుకుకుంది. మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

Exit mobile version