Site icon Prime9

కరోనా ఫియర్ : కరోనా భయంతో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లి, కూతురు… ఎక్కడంటే ?

by-covid-fear-mother-and-daughter-staying-in-home-from-4-years

by-covid-fear-mother-and-daughter-staying-in-home-from-4-years

Corona Fear : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. పేద, ధనిక.. చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఆ వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను, ఆప్తులను, మిత్రులను ఎలా ఎందరినో దూరం చేసిన కరోనా… చివరి చూపు చూసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసింది. అయితే పరిస్థితులు ఇప్పుడు చక్కబడ్డాయి అని చెప్పాలి. ప్రజలంతా ఇప్పడు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ కాలంలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు.

కరోనా బారిన పడిన వారిని కాపాడేందుకు డాక్టర్లు అలుపెరగకుండా కృషి చేశారు. అయితే. వైరస్‌ను తేలిగ్గా తీసుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మందే ఉన్నారు. మరో వైపు అతి భయంతో విచిత్ర పనులు చేసిన వారు కూడా ఉన్నారు. పరిస్థితులు అన్ని ఇప్పుడు మామూలుగా అయినప్పటికీ కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని కుయ్యేరు గ్రామంలో కరోనా భయంతో నాలుగు సంవత్సరాలుగా ఇంట్లోనే ఒక గదికి పరిమితమై ఉంటున్న ఓ తల్లి, కూతురు. కాగా వివరాల్లోకి వెళ్తే… ఆ తల్లి పేరు భవాని, కూతురు పేరు మణి అని గుర్తించారు. కరోనా భయంతో నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు వైద్య సిబ్బంది ఎంత ప్రయతించినా కూడా… దుప్పటి ముసుగులో ఉంటూ సమాధానం చెబుతున్నారు.

ఈ నాలుగేళ్లలో తండ్రి తీసుకొచ్చే ఆహారాన్ని మాత్రం తింటూ ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అలానే తల్లి, కూతుళ్ల మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని వైద్య సిబ్బంది తెలిపారు. చివరికి పోలీసులు, ఆశావర్కర్లు, ఏ‌ఎన్‌ఎం లు అందరూ కలిసి వారికి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version