Site icon Prime9

Chandrababu Naidu: ఎన్‌డీఏతోనే కొనసాగుతాం.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu:  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే ఎన్‌డీఏ సమావేశానికి బాబు ఢిల్లీ వచ్చారు. తాను ఎన్‌డీఏతోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు. కాగా ఇండియా కూటమి ఇటు బాబుతో పాటు అటు నితీష్‌కు గాలం వేసే ఆలోచనలో ఉన్నట్లు రాజధానిలో పెద్ద ఎత్తున ఊహాగానాలు నెలకొన్నాయి. కాగా ఢిల్లీలో బాబు దిగగానే ఆయన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్పీకర్‌ పదవికోసం ..(Chandrababu Naidu)

అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు కూడా మోదీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఆయన ప్రధానంగా స్పీకర్‌ కోసం పట్టుబడుతున్నారని చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బాబుతో ఇప్పటి వరకు ఎవరూ సంప్రదించలేదు. అయితే బాబును ఇండియా కూటమిలో చేరాల్సిందిగా ఇండియా కూటమి రాయబారాలు పంపుతున్నట్లు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ బయలుదేరడానికి ముందు ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో గతంలో కూడా పలు రాజకీయ మార్పులు జరగడం తాను చూశానని చెప్పారు. మొత్తానికి తాను మాత్రం ఎన్‌డీఏతోనే ఉంటానన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డీఏ సమావేశానికి వెళుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో ఎగుడు దిగుడులు చాలా చూశానన్నారు బాబు. మన దేశ చరిత్రలో చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. వారిలో కొంత మంది చరిత్రలో కలిసిపోయారన్నారు. ఇది చారిత్రిక ఎన్నిక. విదేశాల నుంచి కూడా సొంత ఊర్లకు వచ్చి ఓటు వేసిన సంఘటనలు కూడా జరిగాయని టీడీపీ చీఫ్‌ బాబు అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీని ఎన్‌డీఏలో భాగస్వామ్యం చేయడానికి ఆయన కృషి చేశారన్నారు. రాష్ట్రాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడారని పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కూటమికి గెలడానికి మూడు పార్టీలు కలిసి చేసిన కృషి ఫలించిందన్నారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు.

Exit mobile version
Skip to toolbar