Site icon Prime9

kanna Laksminarayana: మేమంతా పవన్‌ వెంటే.. జనసేనకు అండగా ఉంటాం- కన్నా సెన్సేషనల్ కామెంట్స్

kanna

kanna

Kanna Laksminarayana: ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్‌ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. పవన్‌కు మేమంతా అండగా ఉంటాం. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ బతికి ఉండకూడదని జగన్ ఆలోచన అని విమర్శించారు. జగన్‌ది పాలన కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ల కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని కన్నా ఆరోపించారు. కన్నా లక్ష్మినారాయణ ఇటీవలి కాలంలో పార్టీపై.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది రెండో సారి.

Exit mobile version