Nagababu: వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
.పోలింగ్ ప్రక్రియకు ఎన్నో ఆటంకాలు కలిగించినా,బెదిరింపులకు పాల్పడిన , దాడులకు పాల్పడ్డా ఓటర్లు వెనకడుగు వేయకుండా ఓట్లు వేశారని అయన అన్నారు. ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనే విషయం వైసీపీ వారికి అర్థం అయిపోయిందని ,. అందుకే ఎన్నికలు ముగిశాక కూడా ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని నాగబాబు తెలిపారు .పోలింగ్ అనంతరం కూడా ప్రజలను వేధిస్తున్నారని నాగబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడడం వైసీపీ హింసకు పరాకాష్ఠగా మారిందని అన్నారు. అదే విధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూటమి అభ్యర్థి అఖిలప్రియ గన్ మెన్ పై దాడికి దిగారని అన్నారు. తాడిపత్రిలో అశాంతి రేపారని.. పోలింగ్ రోజున రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్లను అపహరించి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. నక్కల సుబ్రహ్మణ్యం కంటికి తీవ్రగాయం అయిన విషయాన్ని నాగబాబు ప్రస్తావించారు.
హింసకు పాల్పడ్డ వైసీపీ వాళ్ళే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉంది. దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందన్నారు . పోలింగ్ అనంతరం హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలని కోరారు . జూన్ 4 న వచ్చే ప్రజా తీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉంది. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి నాగబాబు కోరారు .