Site icon Prime9

Venkayya Naidu : ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది – వెంకయ్య నాయుడు

Venkayya Naidu shocking comments on present politics

Venkayya Naidu shocking comments on present politics

Venkayya Naidu : అసలు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక సంచికను విడుదల చేశారు. వెంకయ్య నాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, తదితరులు కూడా హాజరయ్యారు.

ఈ మేరకు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కాసరనేని సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవకొసమే వైద్య వృత్తిలో కొనసాగారని అన్నారు. రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు మాత్రమే పరమావధిగా వైద్యం చేస్తున్నారనే అపవాదు ఉందని అన్నారు. దాని నుంచి వైద్య రంగం బయట పడాలని ఆకాంక్షించారు. అనంతరం వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సేవ పురస్కారాలను అందించారు.

అలానే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు ఆలోచించాలని, మనం ఏం చేయలేం అని అనుకోకుండా అందరూ కలిసి చెడును కడిగేయాలని పిలుపు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మహనీయులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రస్తుతం కులం డబ్బులు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని అన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలని.. వాటిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడుకోకూడదని అన్నారు. రాజకీయ నాయకులకు కులం చూసి కాకుండా గుణం చూసి ఓటు వేయాలని సూచించారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు.

Exit mobile version