Nagababu: 2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. సోమవారం యూఎస్ కు చెందిన ప్రవాసాంధ్రులతో నాగబాబు టెలికాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు.
విజయమే లక్ష్యంగా ..(Nagababu)
ఈ సందర్బంగా నాగాబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమన్నారు.తటస్ద ఓటర్లను పార్టీ వైపు మలచడంతో పాటు పార్టీ సిద్దాంతాలు, భావజాలాన్ని, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను సామాన్యులకు అర్దం అయ్యేలా చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన రాజోలు నియోజక వర్గాన్నిఆదర్శంగా తీసుకుని పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. అవకాశంఉన్నవారు తప్పకుండా స్వదేశానికి వచ్చి పార్టీ కోసం పనిచేయాలన్నారు. అవకాశం లేనివారు అక్కడినుంచే పార్టీ గెలుపుకోసం కృషి చేాయలన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులను సమాయత్త పరచడం కోసం తాను త్వరలోనే యూఎస్ లో పర్యటిస్తానని నాగబాబు చెప్పారు.