ECI: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు.. మరో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. దీంతో ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు.. మరో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. దీంతో ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
సమయం తక్కువగా ఉండటంతో.. ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల్లో గుర్తు.. ఆర్డర్ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు.. జులై 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 12 తర్వాత, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
వచ్చే ఏడాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 11తో, లోక్‌సభ గడువు 2024 జూన్ 16తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఏదైనా అసెంబ్లీ గడువు తేదీ కంటే ముందే రద్దయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్ జారీచేసే నాటికి అయిదురోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.