Site icon Prime9

PM Modi In Hyderabad: దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదు- ప్రధాని మోదీ

pm modi(hyd)

pm modi(hyd)

 PM Modi IN Hyderabad:జూన్‌ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదని అన్నారు

లూటీలూటీ.. వారసత్వ రాజకీయాలు.. ( PM Modi In Hyderabad)

2012లో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు కాంగ్రెస్‌ పాలనలో బలయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగాయి. అందుకే మోదీని దించాలని చాలామంది చూస్తున్నారని విమర్శించారు . కాంగ్రెస్‌ వద్దు, బీఆర్‌ఎస్‌ వద్దు. మజ్లిస్‌ వద్దని తెలంగాణ అంటోందని మోదీ పేర్కొన్నారు .టీ లూటీ లూటీ, వారసత్వ రాజకీయాలు ఇవే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు. మీ సంపదను లాక్కునే వాళ్లు కావాలా.. మీ సంపదపై మీ పిల్లలకు హక్కుఉండాలా వద్దా. రాముడికి పూజ చేయడం తప్పా అంటూ మోదీ ప్రశ్నించారు . నాకు హైదరాబాద్‌ చాలా ప్రత్యేకం అని తెలిపారు మోదీ . యువరాజుకు ట్యూషన్‌ చెప్పే నేత రామ నవమి చేసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్‌ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు కోటా ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్‌ పార్టీ మోడల్‌. తెలంగాణకు ఎయిమ్స్‌, వందేభారత్‌ రైళ్లు ఇచ్చిందెవరో చెప్పాలి’అని మోదీ అన్నారు .

Exit mobile version