Site icon Prime9

IMD: హైదారాబాద్ కు ఎల్లో అలర్ట్.. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Yellow-alert-for-Hyderabad

Hyderabad: తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల అంచనా. ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 8మంది చనిపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కారణంగా అనేక కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట జలాశయానికి భారీగా వరద రావడంతో 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్ల ముందు వరద నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గన్నేరువరం, పారువెల్ల చెరువు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Exit mobile version