Site icon Prime9

Governor vs CM: గవర్నర్ ను పిలిచేదెప్పుడు…బిల్లులు పాస్ చేసుకొనేది ఎప్పుడు…అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసిఆర్

When will Assembly Bills be passed from the Governor...KCR is acting arrogantly

When will Assembly Bills be passed from the Governor...KCR is acting arrogantly

Hyderabad: రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం తాము చట్టసభల్లో చేసిన తీర్మానాలను గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించుకొంటున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంపుకు అక్కడి పాలకులు శ్రీకారం చుట్టారు. కేవలం వ్యక్తిగత స్వార్ధంతో అభివృద్ధిని చేజేతులారా పోగొట్టుకొంటున్న తెలంగాణ ప్రభుత్వ పరిపాలనపై ప్రైం9 న్యూస్ ప్రత్యేక కధనం..

భాజపా తెలంగాణాలో ఎదగకూడదు. మరో పార్టీకి అధికారంలో ఉండే అర్హత సాధించకూడదు. ఇది నేటి అధికార పార్టీ తెరాస తీరు. ఉద్యమ ప్రభావం నడుమ అందలమెక్కిన సీఎం కేసిఆర్ గడిచిన 8 సంవత్సరాలుగా నియంత పాలన సాగిస్తున్నారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు కోడై కూస్తున్నాయి. సీఎం కేసిఆర్-గవర్నర్ తమిళ సై మద్య ఓ ప్రోటోకాల్ విషయంలో వివాదం ప్రారంభమైంది. గవర్నర్ పర్యటనలో కలెక్టర్, ఎస్పీ స్థాయి వ్యక్తులు స్వాగతం పలుకుతారు. అయితే గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కేసిఆర్ భావిస్తే, అది కాస్తా గవర్నర్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి మద్య గ్యాప్ చోటుచేసుకొనింది. అది ఎంత స్థాయికి తీసుకెళ్లింది అంటే పాలనలో గవర్నర్ వ్యవస్ధను సైతం కేసిఆర్ పక్కనే పెట్టే స్థాయికి చేరుకొనింది.

గవర్నర్ ప్రసంగం లేకుండానే గత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. అందుకు సాంకేతిక కారణాలు చూపిస్తూ సీఎం కేసిఆర్ కొత్త నాటకానికి తెరలేపారు. దీంతో గవర్నర్ తమిళ సై అభ్యంతరం వ్యక్తం చేశారు. జనవరి 26న ప్రసంగించాల్సిన సమాచారాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపిస్తుంది. అంతేగాని అది కాకుండా మరొకటి గవర్నర్ మాట్లాడేందుకు వీలుండదు. అయితే ఇరువురు మద్య ఏర్పడిన గ్యాప్ తో ఒక దశలో గవర్నర్ ప్రసంగాన్ని సీఎం కార్యాలయం పంపిచలేకపోయింది. ఆ సమయంలో గవర్నర్ తమిళ సై వ్యక్తిగతంగా ప్రసంగించారు. ఈ ఘటన కాస్తా అగ్నికి అజ్యం పోసిన్నట్లుగా మారింది.

కేసిఆర్-తమిళసై మద్య ఏర్పడిన అవాంతరాలతో అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు గవర్నర్ ఆమోదం నేటి వరకు లభించలేదు. ఎప్పుడు లభిస్తాయో గవర్నర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటాయి. 6 చట్టసవరణ బిల్లులతో పాటు మరో 2 కొత్త బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు కామన్ బోర్డు, మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఫారెస్ట్ వర్సిటీ, అజామాబాద్‌ పారిశ్రామికవాడ చట్టం బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. అయితే ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే ఆమోదం తెలపాల్సిన అవసరం గవర్నర్ వ్యవస్ధకు ఉండదు. అందుకు సంబంధించిన అనేక అంశాలు అధ్యయనం తర్వాతే ఆమోదం లభిస్తుంటుంది. అందుకే గవర్నర్ తమిళసై పదే పదే ఆమోదం తెలిపే అంశం తన పరిధిలోనిదని చెప్పేశారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలుంటాయని, అయితే తన పరిధికి లోబడే నడుచుకుంటున్నానని మీడియా వద్ద ప్రస్తావన తీసుకొచ్చిన సమయంలో ఆమె వ్యాఖ్యానిస్తుంటారు.

ఇలాంటి పరిస్ధితికి కారణం కేసిఆర్ స్వయంకృపారదమనే స్పష్టంగా పేర్కొన్నాలి. గవర్నర్ వ్యవస్ధ రాజ్యాంగ బద్ధమైంది. అది కూడ కేంద్రంలోని రాష్ట్రపతికి సంబంధించిన ఏజెంట్ గా గవర్నర్ వ్యవహరిస్తుంటారు. రాజకీయాల నేపథ్యంలో సీఎం కేసిఆర్ గవర్నర్ వ్యవస్ధను వ్యతిరేకించవచ్చుగాని, అంతిమంగా గవర్నర్ వ్యవస్ధే ఎంతో కీలకం.

అయితే అధికారం ఉందిగదానని కేసిఆర్ భాజపా ఏజెంట్ గా గవర్నర్ తమిళ సైను పేర్కొంటూ ఆమెను దూరం పెడుతున్నారు. అందుకే కేంద్రాన్ని ఢీకొట్టేందుకు తెరాస ను భారాసగా మార్చి తన సత్తా ఏందో భాజపాకు చూపించాలని కేసిఆర్ ఎత్తులు వేస్తున్నారు. అంతేగాని అధికారం అనేది శాశ్వతం కాదు, గెలుపు, ఓటములు సహజమనే భావన నుండి బయటకు రానంతవరకు సీఎం కేసిఆర్ కు గవర్నర్ తమిళసై నుండి భంగపాట్లు తప్పవు.

ఇది కూడా చదవండి: Y.S. Sharmila: 8ఏళ్లుగా సీఎం కేసిఆర్ ఆడింది ఆటగా సాగింది..షర్మిల

Exit mobile version