Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి రూట్ లో‘వందే భారత్’ చార్జీలివే..

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. ఈ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. హైటెక్ హంగులతో రూపుదిద్దుకున్న ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్‌ దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రయాణికుల నుంచి డిమాండ్‌ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

ట్రైన్ టైమింగ్స్ ఇలా..(Vande Bharat Express)

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రూట్ లో మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో వందేభారత్ నడుస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉంచిన దానిప్రకారం ఈ రైలులో టికెట్ల ధరలు..

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ. 1680, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ. 3080 లుగా నిర్ణయించారు. అదే, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ. 1625, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030లుగా పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధర బేస్‌ ఫేర్‌ రూ. 1168 గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ ఛార్జ్ రూ. 40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జ్ రూ. 45, మొత్తం జీఎస్టీ రూ. 63 గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఫుడ్ కు ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్‌ ఛార్జీ రూ. 364 వసూలు చేయనున్నారు. అలాగే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జ్ రూ. 1169 గా ఉంది. కేటరింగ్‌ ఛార్జీని మాత్రం రూ. 308 గా పేర్కొన్నారు. దీనివల్ల అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో స్వల్స వ్యత్యాసం ఏర్పడింది.

 

ఛైర్‌కార్‌ లో సికింద్రాబాద్‌ నుంచి ఛార్జీలు(Vande Bharat Express)

 

సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ. 470

సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ. 865

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.1075

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.1270

సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛార్జీలు

 

సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ. 900

సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ.1620

సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ. 2045

సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ. 2455,

సికింద్రాబాద్ నుంచి తిరుపతి -రూ. 3080