TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు.. మరో నలుగురి అరెస్టు

TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.

TSPSC: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నపత్రాల లీకేజీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా.. సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఇప్పటివరకు 27కు చేరుకుంది.

మరో నలుగురు అరెస్ట్..

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నపత్రాల లీకేజీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా.. సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఇప్పటివరకు 27కు చేరుకుంది.

విచారణలో భాగంగా.. తాజాగా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల నుంచి వీరు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్‌లను రెండుసార్లు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు.

ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు.

బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.

అనుమానాస్పద లావాదేవీలతో పాటు గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిందితులు చేసిన ఫోన్ కాల్స్‌ను అధికారులు పరిశీలించారు.

పూర్తి కాల్ డెటాతో వివరాలను సేకరించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ కి సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు చేశారు.

సదరు వ్యక్తులను పిలిచి ప్రశ్నించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మురళీధర్ రెడ్డి, మనోజ్ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల ఆధారంగా గుర్తించారు.

ఇవాళ అరెస్ట్ చేసిన నలుగురు సైతం ప్రశ్నపత్రాల కోసం ప్రవీణ్, డాక్యానాయక్‌లకు డబ్బులు చెల్లించినట్లు సిట్ అధికారులు తేల్చారు.

ఈ కేసులో సిట్ అధికారులు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సరైన ఆధారాలు లభిస్తే వాళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.