Site icon Prime9

BJP Meeting In Warangal: వరంగల్ లో బీజేపీ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Hyderabad: వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సభకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు సభకు నిర్వహించుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు సభకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని రేపు వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. పోలీసులు అనుమతివ్వని కారణంగా ఆర్ట్స్ కాలేజీ సిబ్బంది కూడ సభకు అనుమతివ్వలేదు. అయితే ఆర్ట్స్ కాలేజీలో సభకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతివ్వని కారణంగా బీజేపీ నేతలు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వరంగల్ లో సభ నిర్వహణకు అనుమతిని ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొంటారు.

Exit mobile version
Skip to toolbar