Site icon Prime9

Operation Akarsh Deal: ప్రలోభాల డీల్ ఆడియో క్లిప్పులను విడుదల చేసిన తెరాస పార్టీ..

Trs party released audio clips of legislators' purchase deal...

Hyderabad: తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో బేరాసారాల జరిగిన ఆడియో క్లిప్పులను తెరాస పార్టీ విడుదుల చేసింది.

నిన్నటిదినం పార్టీ శ్రేణులు ఎవ్వరూ మాట్లాడవద్దని పేర్కొన్న కేటిఆర్ సూచనల అనంతరం ఆడియో టేపులు బయటకు రావడం గమనార్హం. పోలీసుల చేతిలో ఉన్న ఆడియో క్లిప్పులను తెరాస శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామీజీ రామచంద్ర భారతి, నందకుమార్ల మద్య జరిగిన సంభాషణ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ మార్పులు, భవిష్యత్ లో అందుకోబోతున్న అందలాలు గురించి సంభాషణ సాగింది. ఇది కూడా చదవండి: తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ లో కీలక మలుపు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాజపా

స్వామిజీ: బీజేపీలోకి రావడానికి నేను క్లియర్ చేస్తాను. బీజేపీలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడిస్తాను. ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా నేను చూసుకుంటాను.
పైలెట్ రోహిత్ రెడ్డి: నాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. ఈ వ్యవహారం పై హైదరాబాద్‌లో చర్చిద్దాం.
స్వామీజీ: హైదరాబాద్‌లో కాకుండా వేరే రాష్ట్రంలో చర్చిద్దాము.
పైలెట్ రోహిత్ రెడ్డి: నాతో పాటు వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను నెంబర్ 2 ముందు కూర్చున్నప్పుడు రివీల్ చేస్తాను అంటూ ఇరువురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వామీజీ: బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ జీ డిసైడ్ చేస్తారు. నెంబర్ 1, నెంబర్ 2 సంతోష్ ఇంటికే వస్తారు అంటూ ఇరువురి మధ్య జరిగిన ఆడియో సంభాషణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

కేవలం మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించేందుకు అధికార పార్టీ పన్నాగంగా ఆ పార్టీ శ్రేణులు పదే పదే పేర్కొంటున్నారు. మరోవైపు ఘటన పై స్పందిస్తూ యాదాద్రిలో ప్రమాణం చేయాలంటూ కేసిఆర్ కు సవాల్ విసిరిని బండి సంజయ్ ను అడ్డుకొనేందుకు తెరాస శ్రేణులు యాదాద్రిలో నానా హంగామా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Operation Akarsh: ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్.. హైకోర్టుకు పోలీసులు

   Plastic control: ప్లాస్టిక్ నియంత్రణ ఒట్టిమాటే…పర్యావరణమా! భాగ్యనగరంలో నీ జాడెక్కడ?

Exit mobile version