Site icon Prime9

Revanth Reddy: భారత్ జోడో యాత్రలో రాబోయే మూడు రోజులు కీలకం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Hyderabad: మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపధ్యంలో దీనిపై నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీలో టీకాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జోడోయాత్రలో రాబోయే మూడు రోజులు అత్యంత కీలకమన్నారు. మక్తల్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం రాహుల్ కు అండగా నిలబడింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చింది. అయినా యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ నెల 5, 6న మాత్రమే పాదయాత్ర కొనసాగుతుంది. 5న సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. 6న ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదు. 7న వీడ్కోలు సమావేశం బాగా నిర్వహించవలసిన అవసరం ఉందని తెలిపారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.

ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదు. సాయంత్రం 4నుంచి 6 లోపే బహింరంగ సభను నిర్వహించుకోవాలి. ఈ నెల 7న రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. రాత్రి 9.30 కు దెగ్లూరులో మహారాష్ట్ర వారికి పరిచయం చేయబోతున్నాం. నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల నాయకులు ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలి. రాహుల్ యాత్ర కవరేజీ కాకుండా కుట్రలు చేసినా మీడియా మంచి కవరేజ్ ఇచ్చిందన్నారు. జర్నలిస్టులకు కూడా చాలా అన్యాయం జరిగింది. జర్నలిస్టు సంఘాల నాయకులకు కూడా రాహుల్ తో ప్రత్యేక సమయం కల్పిస్తాం. వారి సమస్యలను రాహుల్ కు విజ్ఞప్తి చేసుకోవచ్చని చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క షబ్బీర్ అలీ, ఏఐసీసీ నేత బోసురాజు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version