Site icon Prime9

Telugu Desam Party : తెలంగాణలో టీడీపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి

Telugu Desam Party leader ravula chandrashekar joined in brs

Telugu Desam Party leader ravula chandrashekar joined in brs

Telugu Desam Party : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకున్న ఆయన..  బీఆర్ఎస్ గూటికి చేరారు.

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా పని చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ముఖ్యనేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లారు. రావుల మాత్రం టీడీపీని వీడలేదు. ఇప్పుడు ఆయన పార్టీ మారారు.

 

Exit mobile version