Site icon Prime9

Telangana: తెగ తిన్నారు.. మాంసం వినియోగంలో తెలంగాణ @1

telangana-top-in-mutton-consumption

telangana-top-in-mutton-consumption

Telangana: తెలంగాణలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగు ఏళ్లలో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల ద్వారా మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.

సుమారుగా గత నాలుగు సంవత్సరాల్లో రూ. 58,500 కోట్లను మాంసం కోసం జనం వెచ్చించారు. ఇక, గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.90 లక్షలకు పైగా గొర్రెలు ఉన్నాయి. రాష్ట్రంలో 2015-16లో గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులుగా ఉండగా, 2020-21 నాటికి అది రెండింతలై 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది అది 3.50 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో గొర్రెలు, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలైతే తెలంగాణ అత్యధికంగా 21.17 కిలోలుగా ఉందని సర్వే వెల్లడిస్తోంది.

ఇదీ చదవండి: తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

Exit mobile version