Site icon Prime9

MLA Raja Singh: మరోసారి అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hyderabad: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వ‌ర్గం పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్‌ను మంగ‌ళ్‌హాట్ పోలీసులు నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. దీన్ని రాజాసింగ్ న్యాయ‌వాది కోర్టులో స‌వాల్ చేశారు. 41 సీఆర్‌పీసీ కండిషన్ ను పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు.

పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది.

Exit mobile version