Site icon Prime9

Sonia Gandhi : తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం.. ఏం చెప్పారంటే ?

Sonia Gandhi video message to people of telangana

Sonia Gandhi video message to people of telangana

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోఇ షేర్ చేసింది. ఆ మెసేజ్ లో సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేయాలని తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు.

అదే విధంగా ఇంకా మాట్లాడుతూ.. ప్రియమైన నా సోదరీమణులు మరియు ప్రియమైన తెలంగాణ సోదరులారా, నేను మీ అందరి మధ్యకు రాలేకపోయాను కానీ మీ హృదయాలకు చాలా దగ్గరయ్యాను. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి.. అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలని అన్నారు. మనం అందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ కలలను నిజం చేసుకోండి.

మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మీరు నన్ను సోనియమ్మా అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుతగా ఉంటాను. ఎప్పటికీ మీకు అంకితమై ఉంటాను. తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్‌కు ఓటు వేయండి’’ అని సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు.

 

Exit mobile version