Hyderabad: మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిట్ ఆఫీసుకు రావాలని అందులో సూచించారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అధికారులు నోటీసులో స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు మొయినాబాద్ ఫాంహౌస్ లో కొందరు వ్యక్తులు సంప్రదించారని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి వంద కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని వారు తెలిపారు. ఈ విషయం కేసీఆర్ కు తెలియజేయడంతో ముందుగా సీసీటీవీలు అవి సెట్ చేసి ఆడియో, వీడియో అధారాలు సంపాదించారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు.