Site icon Prime9

Revanth Reddy : దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? – రేవంత్ రెడ్డి

Revanth Reddy shocking comments on brs government

Revanth Reddy shocking comments on brs government

Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

నీతికి, నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యంరెడ్డి. అలాంటి ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది. తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు. కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడు అని ఎద్దేవా చేశారు. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైంది. కేంద్రం నిధులు తెచ్చి రఘునందన్ రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్నారు. మూడేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకోని రఘునందన్ కు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదు. ఈ ప్రాంతానికి 10వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేది. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప… ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని అన్నారు.

 

 

Exit mobile version