Site icon Prime9

Bharat Jodo Yatra: హైదరబాద్ కు రాహుల్ గాంధీ.. భాగ్యనగరంలో జోడో యాత్ర షురూ

bharath Jodo Yatra in Hyderabad

bharath Jodo Yatra in Hyderabad

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగుతూ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనుంది. రాహుల్‌ గాంధీ నేడు భాగ్యనగరంలో అడుపెట్టనున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించింది.

ఈ రోజు సాయంత్రం నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌కు రాహుల్ చేరుకుంటారు. మూడు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో రేపటి నుంచి రాహుల్ జోడోయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.వచ్చే నెల 7 వరకు తెలంగాణలో ఈ జోడోయాత్ర కొనసాగనుంది. మొత్తం తెలంగాణలో 375 కిలోమీటర్లు మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో రాహుల్‌ కాంగ్రెస్ పార్టీ నేతలతో కార్నర్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్ర చివరిరోజున టీకాంగ్రెస్ నేతలు ఓ భారీ సమావేశానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీ కాంగ్ నేతలైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు, తదితరలు పాల్గొంటారు.

ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌కు కొరడాదెబ్బలు.. ఎందుకో తెలుసా?

Exit mobile version