Priyanka Gandhi : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమఘ్నమయ్యారంటూ విమర్శించారు. తాము సంపదను ప్రజలకు పంచి పెడతామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు.
Priyanka Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం – ప్రియాంక గాంధీ

Priyanka Gandhi speech at madhira congress party vijayabheri meeting