Preeti: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీతికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి.. తన తల్లితో ఫోన్ లో సంభాషించింది. ఇందులో సైఫ్ వేధింపుల గురించి తన తల్లికి ప్రీతి వివరించింది.
సీనియర్లంతా ఒక్కటయ్యారమ్మా.. (Preeti)
ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. ఇక్కడ సీనియర్ల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అందులో తెలిపింది. సైఫ్
చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని తల్లికి తెలిపింది. సీనియర్లు అంతా ఒక్కటే అని.. పోలీసులతో నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని వివరించింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్ పై ఫిర్యాదు చేస్తే.. సీనియర్లు ఒకటై నన్ను దూరం పెడతారని తన బాధను వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విషమంగా ప్రీతి ఆరోగ్య పరిస్థితి..
పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న ప్రీతి పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్స్ వైద్యలు ఎక్మో సాయంతో.. ప్రీతికి వైద్యం అందిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. సీనియర్ విద్యార్ధి ర్యాగింగ్ వల్లే.. ప్రీతి అనే మెడికల్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సీపీ రంగనాథ్ మీడియాకు పలు విషయాలన వెల్లడించారు. సైఫ్ అనే సీనియర్ ప్రీతిని వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్ వేధించినట్లు ఆధారాలు లభించాయని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ప్రీతిని కావాలనే టార్గెట్ చేసి సైఫ్ వేధించేవాడని తెలిపారు. గత నాలుగు నెలలుగా సైఫ్ వేధిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రీతి చాలా సున్నిత మసన్తత్వం కలిగిన అమ్మాయని అన్నారు. ప్రీతికి ఎవరు సహాయం చేయవద్దని.. సైఫ్ తన మిత్రులతో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పలు సందర్భాల్లో బ్రెయిన్ లేదంటూ హేళన చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం..
ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి విషమంగానే ఉంది. ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కాస్త మెరుగవుతుందని వైద్యులు వివరించారు. ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రీతి అనే అమ్మాయి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ప్రీతి తండ్రి ఆవేదన..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రీతి తండ్రి స్పందించారు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పోలీసులు దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ర్యాగింగ్ పై పోలీసులకు ఇది వరకే సమాచారం ఇచ్చామని.. సకాలంలో వారు స్పందించలేదని చెప్పుకొచ్చారు. కాలేజీలో సీనియర్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రీతి తమ్ముడు అన్నాడు. వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.