Site icon Prime9

Inter Exams: ఇంటర్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. ఇకపై ఇంగ్లీష్ లోనూ ప్రాక్టికల్స్

practicals-implemented-in-intermediate-english-in-telangana

practicals-implemented-in-intermediate-english-in-telangana

Inter Exams: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అమలు చేయనున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో తెలంగాణ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. దీనితో థియరీ మార్కులు తగ్గనున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్ లో ప్రాక్టికల్స్ అమలుపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

వచ్చే విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఇంగ్లీష్ లో థియరీకి 80, ప్రాక్టికల్స్ కు 20 మార్కులు కేటాయించనున్నారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నర్ పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించనున్నారు. నూతన విధానంతో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూ ల్యాబ్ వర్క్ తప్పనిసరి కానుంది. దీంతో అన్ని కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ లో మాట్లాడటం, కంప్యూటర్ సహకారంతో ఆడియో రికార్డు చేయడం వంటి వాటిని నేర్చుకుంటారు. థియరీ క్లాసులతోపాటు ల్యాబ్ వర్క్ కోసం కాలేజీలు షెడ్యూల్ లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ విధానం ఇంజినీరింగ్ కాలేజీల్లో అమల్లో ఉంది.

ఇదీ చదవండి: మాండూస్ తుఫాను బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

Exit mobile version