Site icon Prime9

Munugode by poll: జూబ్లీహిల్స్ వద్ద రూ. 89.91లక్షలు పట్టివేత

Police seized Rs 89.91 lakh at Jubilee Hills

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ముందస్తుగా అందిన సమాచారంతో పోలీసులు జూబ్లీహిల్స్ లోనిన భారతీయ విద్యాభవన్ సమీపంలో సోదాలు చేస్తుండగా ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడింది. పట్టుబడ్డ డ్రైవర్ను కడారి శ్రీనివాస్ గా గుర్తించారు. నగదును జూబ్లీ హిల్స్ లోని త్రిపుర కన్స్ స్ట్రక్షన్ కంపెనీ నుండి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడిన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Minister Harish rao: భాజపా డిఎన్ఏలోనే అబద్దాలు ఉన్నాయి.. మంత్రి హరీష్ రావు

Exit mobile version