Site icon Prime9

PM Modi : నేడు వరంగల్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఏంటి ? ఎన్ని వేల కోట్ల పనులకు శంఖుస్థాపన చేయనున్నారంటే ??

PM Modi warangal tour schedule and inaguaration programmes details

PM Modi warangal tour schedule and inaguaration programmes details

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా.. పోలీసులు నిఘా నీడలో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గస్తీ కాస్తున్నారు. ఈ పర్యటన నిమిత్తం దాదాపు 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలో ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై పోలీసులు నిషేధం విధించారు. కాగా ప్రధాని వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని.. వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరి వెళ్లనున్నారు.

మోదీ పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే ‘విజయ సంకల్ప సభ’లోమోదీ పాల్గొంటారు. ప్రధాని (PM Modi) వెంట కేంద్ర మంత్రులు నితిన్ గఢ్కరీ, కిషన్ రెడ్డిలు పాల్గొంటారు.

ప్రధాని (PM Modi) షెడ్యూల్ వివరాలు.. 

ఉదయం 9.25 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
9.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌ ద్వారా వరంగల్‌ బయలుదేరుతారు.
10.15 గంటలకు వరంగల్‌ మామునూరు విమానాశ్రయంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు.
10.15 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి బై రోడ్ బయలుదేరుతారు.
10.30 గంటలకు భద్రకాళి దేవాలయానికి చేరుకుంటారు.
10.30 నుంచి 10.45 గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు.
10.50 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
11.00 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్ లోని సభా స్థలికి చేరుకుంటారు.
11.00 గంటల నుంచి 11.35 గంటల వరకు పీవోహెచ్‌, వ్యాగన్‌ తయారీ యూనిట్‌తో పాటు జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
11.45 గంటలకు బహిరంగ సభ వేదిక పైకి చేరుకుంటారు.
11.45 నుంచి 12.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
12.20 నుంచి 12.30 గంటల వరకు పార్టీ నేతలను కలుసుకుంటారు.
12.30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు.
12.50 గంటలకు వరంగల్‌ మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ చేరుకుంటారు.
12.55 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
1.40 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
1.45 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ బీబీజే విమానం ద్వారా బయలుదేరుతారు.
3.35 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు..
Exit mobile version
Skip to toolbar