Site icon Prime9

PM Modi: ఈనెల 12న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

modi

modi

Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి రామగుండంకి రానున్నారు.

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ఆయన ఎన్‌టీపీసీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం చేస్తారు. ఇక్కడే సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. తెలంగాణకు మంజూరైన మూడు నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు కూడా మోదీ రామగుండంలోనే శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాగా, బొగ్గు రవాణాకు సంబంధించి సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ నిర్మించారు. సింగరేణి, రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో రూ. 927.94 కోట్ల వ్యయంతో 54 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించారు.

ఇందులో సింగరేణి రూ.618 కోట్లు వెచ్చించగా, రైల్వే రూ.109 కోట్లు వెచ్చించింది. ఈ ప్రాజెక్టు పూర్తయి వినియోగంలోకి కూడా వచ్చింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పై సమీక్షించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది.

Exit mobile version