Site icon Prime9

Orange Brigade Bike Rally: ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Minister-Kishan-Reddy

Hyderabad: ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగనుంది. మృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరుపున వివిధ కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తోంది.

శనివారం పరేడ్ గ్రౌండ్​లో విమోచన ఉత్సవాలు ముగిశాక పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లతో, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

Exit mobile version