Site icon Prime9

One-Time Settlement Scheme: ఆస్తిపన్ను బకాయిలకు రేపటితో ముగియనున్న వన్‌టైం సెటిల్మెంట్‌ స్కీం

property tax

property tax

Hyderabad: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్మెంట్‌ స్కీం గడువు రేపటితో ముగియనుంది. మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతుండడంతో నిధుల కొరత ఏర్పడి అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు మునిసిపల్‌శాఖ వన్‌టైం సెటిల్మెంట్‌ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు

ఏప్రిల్‌ 2022కు ముందు బకాయి ఉన్న ఆస్తి పన్నును ఈ నెల 31లోపు ఒకేసారి చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుంది. కేవలం 10శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఆస్తిపన్ను బకాయిల వడ్డీని 90 శాతం మేర మాఫీ చేస్తూ ప్రభుత్వం కల్పించిన ఓటీఎస్‌కు ప్రాపర్టీ యజమానులు స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గతేడాది వరకు 5 లక్షల మందికి పైగా రూ.1400 కోట్లకు పైగా ఆస్తిపన్ను చెల్లించవలసి ఉంది. 15 నుంచి 20 సంవత్సరాలుగా ఆయా భవనాలకు సంబంధించిన పన్ను వసూలు కావడం లేదు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 సెక్షన్‌ 679-ఈ ప్రకారం ఓటీఎస్‌ పథకం కింద ఆస్తిపన్ను పై వడ్డీని మాఫీ చేయాలన్న ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ గతేడాది ఆమోదించింది.

Exit mobile version