Site icon Prime9

Munugode By Poll: రేపే మునుగోడు ఉప ఎన్నిక

Munugodu

Munugodu

Munugode: తెలంగాణలో అందరిదృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 298 పోలింగ్ కేంద్రాల్లో 1,192 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇప్పటికే ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదని, నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానికారి వికాస్‌ రాజ్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. 105 స‌మ‌స్యాత్మ‌క పోలీంగ్ కేంద్రాల‌ను గుర్తించారు. ఇక్క‌డ పోలీంగ్ స‌జావుగా జ‌రిగే ఏర్పాట్ల‌ను చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతితో కలిపి మొత్తం 47 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.

గురువారం పోలింగ్ జరగనున్న క్రమంలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు అందరూ నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉండి మునుగోడు ఓటర్లతో టచ్ లో ఉండాలని, స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని ఆదేశించారు. జిల్లా విడిచి వెళ్ళవద్దని నేతలు అప్పగించిన ప్రాంతంలోని ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి వారితో మాట్లాడాలని సూచించారు. పోలింగ్ ముగిసే వరకు స్థానిక క్యాడర్, ఓటర్లతో టచ్ లో ఉండాలని, వాళ్లు వేరే పార్టీ వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని నేతలకు కేసీఆర్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు నల్గొండ విడిచి వేరే ప్రాంతానికి వెళ్లవద్దని ఆదేశించారు.

Exit mobile version