Munugode: తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితంచేసేలా, ఎంతో ఆసక్తి కల్గించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 92శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855 కాగ మునుగోడు నియోజకవర్గం గత కొద్ది రోజులుగా రాజకీయ ఉద్ధండుల తాకిడితో తడిచిముద్దైంది. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్ తో పాటు తదితరలు తమ ప్రచారంతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందులో నానా హంగామా చేశారు.
మరో వైపు ఈవీఎంలను నల్గొండలోని స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్న సమయంలో వాహనానాన్ని కొందరు వ్యక్తులు వెంబడించారు. రక్షణగా ఉన్న పోలీసులు బస్సును వెంబడించిన వాహనాన్ని పట్టుకొన్నారు. అయితే అందులో ఉన్న 5గురు వ్యక్తులు పరారైనారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Munugode by poll: తెగ తాగారు.. మునుగోడులో గుట్టలుగా ఖాళీ మద్యం సీసాలు