Site icon Prime9

Delhi liquor scam: లిక్కర్ స్కాం.. అభిషేక్ ను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ

Liquor scam...CBI produced Abhishek in court

Liquor scam...CBI produced Abhishek in court

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన అభిషేక్ బోయనపల్లి కస్టడీ ముగియడంతో సీబిఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీబిఐ కోర్టును అధికారుల కోరారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త అరుణ్ పిళ్లైతో అభిషేక్‌కు సంబంధాలు ఉన్నాయని, అరుణ్ పిళ్లైతో మని ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నారు. ఇప్పటికే అరుణ్ పిళ్లై విచారణకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. పిళ్ళై తన ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందని, వాళ్ల కూతురు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని చెప్పారన్నారు. అభిషేక్ కొన్ని విషయాలకు సరిగా సమాధానాలు ఇవ్వటం లేదన్నారు. మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇదే కేసులో ముత్తా గౌతమ్‌ను విచారణ చేస్తున్నామని కోర్టుకి సీబీఐ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  లిక్కర్ స్కాంలో అభిషేక్ రావుదే కీలకపాత్ర.. కస్టడీ రిపోర్టులో సీబీఐ

Exit mobile version