Munugode: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప ఎన్నిక సందర్బంగా నేరుగా లబ్దిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం ఇపుడు కావాలనే ఆలస్యం చేస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
అదే సమయంలో తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి మునుగోడు వచ్చారు. ఈ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా వుండగా రాజగోపాల్ రెడ్డికి చెందిన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. సుశీ ఇన్ ఫ్రా సంస్థకు కేంద్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కేటాయించిందని, అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అయితే వీటిని రాజగోపాల్ రెడ్డి ఖండించారు